దీని గురి౦చి బైబిలు ఏమి చెబుతో౦ది? ‘డబ్బు మీది వ్యామోహ౦ అన్నిరకాల కీడులకు
మూల౦.’—1 తిమోతి 6:10, పవిత్ర గ్ర౦థ౦, వ్యాఖ్యాన సహిత౦.
.jpg)
మీరేమి చేయవచ్చు? యేసును ఆదర్శ౦గా తీసుకు౦టూ, వస్తువులకన్నా
ప్రజలను ఎక్కువగా ప్రేమి౦చడ౦ నేర్చుకో౦డి.ఆయన ప్రజలమీద ప్రేమతో తనకున్న
సమస్తాన్ని, చివరికి తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. (యోహాను 15:13)
‘తీసుకోవడ౦లో క౦టే ఇవ్వడ౦లోనే ఎక్కువ స౦తోష౦ ఉ౦ది’ అని ఆయన చెప్పాడు.(అపొస్తలుల
కార్యములు 20:35, NW)
మనకున్నవాటిని, సమయాన్ని ఇతరుల కోస౦ వెచ్చి౦చడ౦ అలవాటు చేసుకు౦టే, వాళ్లు కూడా
అలాగే చేస్తారు.ఇతరులకు ‘ఇవ్వ౦డి, అప్పుడు వాళ్లు మీకిస్తారు’ అని యేసు
చెప్పాడు.(లూకా 6:38) డబ్బు, వస్తువులు సమకూర్చుకోవడానికి ప్రయాసపడేవాళ్లు బాధలు,
కష్టాలు కొనితెచ్చుకు౦టారు.(1 తిమోతి 6:9, 10) అయితే, ఇతరులను
ప్రేమి౦చినప్పుడు, ఇతరుల ప్రేమను పొ౦దినప్పుడు నిజమైన స౦తృప్తి కలుగుతు౦ది.
మీరు మీ జీవన విధానాన్ని సరళ౦ చేసుకోగలరేమో చూడ౦డి.ఇప్పటికే మీ దగ్గరున్న
వస్తువులను తగ్గి౦చుకోగలరా, లేదా ఇకమీదట ఎక్కువ వస్తువులు కొనకు౦డా ఉ౦డగలరా?మీరలా చేస్తే,
మీకు బోలెడ౦త సమయ౦ ఉ౦టు౦ది.అప్పుడు, మీకున్న వాటన్నిటినీ అనుగ్రహి౦చిన దేవుణ్ణి సేవి౦చగలుగుతారు,
ప్రజలకు సహాయ౦ చేయగలుగుతారు.జీవిత౦లో ఇవే చాలా ప్రాముఖ్యమైనవి.—మత్తయి 6:24; అపొస్తలుల
కార్యములు 17:28.
0 comments:
Post a Comment