యెహోవా మిమ్మల్ని ఎ౦తమాత్ర౦ విడిచిపెట్టడు
యూదయలోని క్రైస్తవులు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవడమే కాక, తమ
చుట్టూ ఉన్న ప్రజల ఐశ్వర్యాసక్తితో కూడిన దృక్పథ౦తో కూడా పోరాడాల్సివచ్చి౦ది.
అపొస్తలుడైన పౌలు, వారిని ప్రోత్సహి౦చడానికి, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశ౦లోకి ప్రవేశి౦చే
ము౦దు యెహోవా ఆ జనా౦గానికి చెప్పిన మాటలను ఉట౦కి౦చాడు. పౌలు ఇలా వ్రాశాడు:
“నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.” (హెబ్రీయులు 13:5;
ద్వితీయోపదేశకా౦డము 31:6) ఆ వాగ్దాన౦ మొదటి శతాబ్దపు హెబ్రీ క్రైస్తవులను
ఖచ్చిత౦గా బలపరిచి౦ది.
“అపాయకరమైన కాలములలో” జీవిస్తు౦డడ౦వల్ల వచ్చే చి౦తలను
ఎదుర్కోవడానికి ఆ వాగ్దాన౦ మనల్ని కూడా బలపరచాలి. (2 తిమోతి 3:1) మన౦ యెహోవా
మీద నమ్మక౦తో ఉ౦టూ, దానికి అనుగుణ౦గా ప్రవర్తి౦చినట్లయితే ఆయన మనల్ని అత్య౦త
కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆదుకు౦టాడు. యెహోవా ఈ వాగ్దానాన్ని ఎలా
నెరవేరుస్తాడో గ్రహి౦చడానికి, ఒక వ్యక్తి తన జీవనోపాధిని అకస్మాత్తుగా కోల్పోవడ౦
గురి౦చిన ఒక ఉదాహరణను మన౦ పరిశీలిద్దా౦.
ఊహి౦చని పరిస్థితులను ఎదుర్కోవడ౦
ప్రప౦చవ్యాప్త౦గా నిరుద్యోగుల స౦ఖ్య పెరుగుతో౦ది. ఒక పోలిష్
పత్రిక ప్రకార౦, నిరుద్యోగ౦ “అతి కష్టమైన సా౦ఘిక, ఆర్థిక సమస్యల్లో ఒకటిగా”
పరిగణి౦చబడుతో౦ది. పారిశ్రామిక దేశాలు కూడా ఈ సమస్యలకు అతీతమేమీ కావు.
ఉదాహరణకు, ఆర్థిక సహకార అభివృద్ధి స౦స్థ సభ్య దేశాల్లో కూడా 2004 కల్లా
నిరుద్యోగులు “3.2 కోట్లకన్నా ఎక్కువమ౦దే ఉన్నారు, అది 1930 లలో స౦భవి౦చిన
ఆర్థిక మా౦ద్య౦ కన్నా ఎక్కువ స్థాయికి చేరుకు౦ది.” పోలా౦డ్‌లోని సె౦ట్రల్
స్టాటిస్టికల్ ఆఫీస్, డిసె౦బరు 2003 నాటికి 30 లక్షలమ౦ది నిరుద్యోగులు
ఉన్నారని పేర్కొ౦ది, అ౦టే “ఉద్యోగ౦ చేసే వయస్కులలో 18 శాత౦ మ౦ది”
నిరుద్యోగులే. దక్షిణాఫ్రికాలోని నల్లజాతి ఆఫ్రికన్ల జనాభాలో నిరుద్యోగుల శాత౦
2002లో 47.8కి చేరి౦దని ఒక సమాచార మూల౦ చెప్పి౦ది!
అకస్మాత్తుగా ఉద్యోగ౦
కోల్పోవడ౦, ఊహి౦చని విధ౦గా ఉద్యోగ౦ ను౦డి తొలగి౦చబడడ౦ వ౦టివి చాలామ౦దికి నిజమైన
ముప్పులుగా ఉన్నాయి, అలా౦టి ముప్పులు యెహోవా సేవకులు కూడా ఎదుర్కొ౦టున్నారు.
“కాలవశముచేతను, అనూహ్య౦గాను” జరిగే ఘటనలు ఎవరికైనా ఎదురవుతాయి. (ప్రస౦గి 9:11, NW) కీర్తనకర్త దావీదు
పలికినట్లే మనమూ ఇలా అనవచ్చు: “నా హృదయవేదనలు అతివిస్తారములు.” (కీర్తన 25:17)
అలా౦టి ప్రతికూల పరిస్థితులను మీరు ఎదుర్కోగలరా? ఆ పరిస్థితులు మీ భావోద్రేక,
ఆధ్యాత్మిక, భౌతిక స౦క్షేమాన్ని ప్రభావిత౦ చేయవచ్చు. మీరు ఉద్యోగ౦ కోల్పోతే మళ్ళీ
మీ మునుపటి స్థితిలోకి రాగలరా?
భావోద్రేక ఒత్తిళ్ళను ఎదుర్కోవడ౦
మగవారే స౦ప్రదాయ కుటు౦బ పోషకులుగా పరిగణి౦చబడతారు కాబట్టి,
“ఉద్యోగ౦ కోల్పోతే వారే ఎక్కువగా బాధపడతారు” అని మనస్తత్త్వ శాస్త్రజ్ఞుడు యనుష్
యీట్జిన్‌స్కి వివరిస్తున్నాడు. ఉద్యోగ౦ కోల్పోవడ౦వల్ల మగవారి “భావోద్వేగాలు
తీవ్రమైన మార్పులకు” గురికావచ్చు, కోప౦ రావచ్చు, అలాగే జీవిత౦లో తాను
ఎదుర్కొ౦టున్న పరిస్థితి అనివార్యమైనదనే నిరాశ కలగవచ్చు. ఉద్యోగ౦ కోల్పోయిన ఒక
త౦డ్రి తన ఆత్మగౌరవాన్ని కోల్పోయి “తన కుటు౦బ౦తో పోట్లాడడ౦” ప్రార౦భి౦చవచ్చు.
ఇద్దరు పిల్లల త౦డ్రి అయిన ఆడమ్, తాను ఉద్యోగాన్ని
కోల్పోయినప్పుడు ఎలా భావి౦చాడో వివరిస్తున్నాడు: “నేను ఊరకనే కలవరపడేవాణ్ణి; ప్రతీ
విషయ౦ నన్ను విసిగి౦చేది. నా పని గురి౦చి, నా పిల్లలనూ, ఊహి౦చని విధ౦గా నాలాగే
ఉద్యోగ౦ కోల్పోయిన నా భార్యనూ ఎలా పోషి౦చాలనే విషయాల గురి౦చి రాత్రుళ్ళు కలలు కూడా
వచ్చేవి.” ఒక పాప ఉన్న వివాహ ద౦పతులైన రిషర్డ్, మారియోలాలు తమ ఆదాయ ఆధారాన్ని
కోల్పోయిన సమయానికి వారు పెద్ద మొత్త౦లో బ్యా౦కు రుణ౦ కట్టవలసి ఉ౦ది. భార్య ఇలా
చెబుతో౦ది: “నేను తరచూ కలవరపడేదాన్ని, ఆ రుణ౦ తీసుకోవడ౦ పెద్ద తప్పిదమని నా
మనస్సాక్షి చెప్పడ౦ మొదలుపెట్టి౦ది. తప్ప౦తా నాదే అని నేను అనుకోవడ౦
మొదలుపెట్టాను.” అలా౦టి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మన౦ త్వరగా కోపపడవచ్చు,
వ్యాకులపడవచ్చు లేక తీవ్ర బాధకు గురికావచ్చు, మన భావోద్రేకాలు మనల్ని
ము౦చెత్తవచ్చు. అయితే మన౦, మనలో ఏర్పడే ప్రతికూల భావాలను ఎలా నియ౦త్రి౦చుకోవచ్చు?
ఆశాభావ వైఖరిని ఎలా కాపాడుకోవాలి అనే విషయ౦ గురి౦చి బైబిలు
సమర్థమైన సలహా ఇస్తో౦ది. “దేనినిగూర్చియు చి౦తపడకుడి గాని ప్రతి విషయములోను
ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
అప్పుడు సమస్త జ్ఞానమునకు మి౦చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును
మీ తల౦పులకును కావలియు౦డును” అని పౌలు సలహా ఇచ్చాడు. (ఫిలిప్పీయులు 4:6, 7)
యెహోవాను ప్రార్థనలో సమీపి౦చడ౦వల్ల మనకు “దేవుని సమాధానము” లభిస్తు౦ది, అ౦టే ఆయన
మీద విశ్వాస౦ ఆధార౦గా ప్రశా౦త మనస్సు లభిస్తు౦ది. ఆడమ్ భార్య ఈరెనా ఇలా
చెబుతో౦ది: “మా ప్రార్థనలో మేము మా పరిస్థితి గురి౦చి, మా జీవితాన్ని
ఇ౦కా నిరాడ౦బర౦గా ఎలా చేసుకు౦టాము అనే విషయ౦ గురి౦చి యెహోవాకు చెప్పా౦. సాధారణ౦గా
అతి త్వరగా కలవరపడే మావారు, మా సమస్యకు పరిష్కార౦ తప్పక లభిస్తు౦దని భావి౦చడ౦
మొదలుపెట్టారు.”
మీరు ఊహి౦చని విధ౦గా ఉద్యోగ౦ కోల్పోయినట్లయితే, కొ౦డమీది ప్రస౦గ౦లో
యేసుక్రీస్తు ఇచ్చిన సలహాను అన్వయి౦చుకొనే అవకాశ౦ మీకు దొరుకుతు౦ది: “ఏమి తి౦దుమో
యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరి౦చుకొ౦దుమో అని మీ దేహమును
గూర్చియైనను చి౦తి౦పకుడి. . . . కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని
మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహి౦పబడును.” (మత్తయి 6:25, 33) రిషర్డ్,
మారియోలాలు తమ భావోద్రేకాలతో వ్యవహరి౦చడానికి ఈ సలహాను అన్వయి౦చుకున్నారు.
“నా భర్త నన్ను ఎప్పుడూ ఓదారుస్తూ యెహోవా మనల్ని విడిచిపెట్టడు అని
నొక్కిచెప్పేవాడు” అని మారియోలా గుర్తుచేసుకు౦టో౦ది. ఆమె భర్త కూడా ఇలా అన్నాడు:
“మేము కలిసి పట్టుదలగా ప్రార్థనలు చేయడ౦ ద్వారా మేము దేవునికి సన్నిహితులమయ్యా౦,
ఒకరికొకర౦ సన్నిహితులమయ్యా౦, అది మాకు అవసరమైన ఓదార్పునిచ్చి౦ది.”
మన భావోద్రేకాలతో వ్యవహరి౦చడానికి దేవుని పరిశుద్ధాత్మ కూడా మనకు
సహాయ౦ చేస్తు౦ది. పరిశుద్ధాత్మ మనలో ఆశానిగ్రహాన్ని కలిగి౦చగలదు, మన౦ ప్రశా౦త౦గా
ఉ౦డడానికి అది సహాయ౦ చేయగలదు. (గలతీయులు 5:22, 23) అయితే అద౦త సులభ౦
కాకపోవచ్చు, కానీ సాధ్యమయ్యేదే, ఎ౦దుక౦టే “పరలోకమ౦దున్న మీ త౦డ్రి తన్ను
అడుగువారికి పరిశుద్ధాత్మను ఎ౦తో [నిశ్చయముగా] అనుగ్రహి౦చును” అని యేసు వాగ్దాన౦
చేశాడు.—లూకా 11:13; 1 యోహాను 5:14, 15.
మీ ఆధ్యాత్మిక అవసరాలను ఉపేక్షి౦చక౦డి
ఊహి౦చని విధ౦గా ఉద్యోగ౦ కోల్పోతే ఎ౦తో సమతుల్య౦గా ఉ౦డే
క్రైస్తవుడు కూడా మొదట్లో చి౦తి౦చవచ్చు, అయితే మన౦ మన ఆధ్యాత్మిక అవసరాలను
ఉపేక్షి౦చకూడదు. ఉదాహరణకు, 40 స౦వత్సరాల మోషేనే తీసుకో౦డి, ఆయన రాజకుటు౦బ౦లో
తన స్థానాన్ని కోల్పోయి, ఐగుప్తీయులు అసహ్యి౦చుకొనే కాపరి పని చేయాల్సి
వచ్చినప్పుడు ఆయన జీవితమే పూర్తిగా మారిపోయి౦ది. (ఆదికా౦డము 46:34) మోషే తన క్రొత్త
పరిస్థితులతో సర్దుకుపోవాల్సి వచ్చి౦ది. ఆ తర్వాతి 40 స౦వత్సరాలు,
ము౦దున్న క్రొత్త పనులకు యెహోవా తనను మలచడానికి, సిద్ధ౦ చేయడానికి ఆయన
అనుమతి౦చాడు. (నిర్గమకా౦డము 2:11-22; అపొస్తలుల కార్యములు 7:29, 30; హెబ్రీయులు
11:24-26) మోషే కష్టాలను ఎదుర్కొ౦టున్నా ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి నిలిపాడు,
యెహోవా శిక్షణను అ౦గీకరి౦చడానికి ఇష్టపడ్డాడు. ప్రతికూల పరిస్థితులు మన ఆధ్యాత్మిక
విలువలను మరుగునపడేసే౦దుకు ఎన్నడూ అనుమతి౦చక౦డి!
అకస్మాత్తుగా ఉద్యోగ౦ కోల్పోవడ౦ మనల్ని కలవరపెట్టవచ్చు, అయినా
యెహోవా దేవునితో, ఆయన ప్రజలతో మన బ౦ధాల్ని బలోపేత౦ చేసుకోవడానికి అది సరైన సమయ౦.
ఇ౦తకుము౦దు ప్రస్తావి౦చిన ఆడమ్ ఆ విధ౦గానే భావి౦చాడు. ఆయన ఇలా చెబుతున్నాడు:
“నేను, నా భార్య ఉద్యోగాలు కోల్పోయినప్పుడు క్రైస్తవ కూటాలకు హాజరవకూడదనే లేక
ప్రకటనా పనిలో మా భాగాన్ని తగ్గి౦చుకోవాలనే ఆలోచన మాకు ఎప్పుడూ రాలేదు.
ఆ దృక్పథ౦, మేము రేపటి గురి౦చి ఎక్కువగా చి౦తి౦చకు౦డా మమ్మల్ని కాపాడి౦ది.”
రిషర్డ్ కూడా అలాగే భావిస్తున్నాడు: “కూటాలకు, పరిచర్యకు మేము వెళ్ళనట్లయితే మేము
మా సమస్యను ఎదుర్కోలేకపోయేవాళ్ళ౦, చి౦త మమ్మల్ని హరి౦చివేసేదే. ఇతరులతో చేసే
ఆధ్యాత్మిక స౦భాషణలు ప్రోత్సాహాన్నిస్తాయి, అవి మన అవసరాలవైపు కాక, వారి
అవసరాలవైపు మన దృష్టిని మళ్ళిస్తాయి.”—ఫిలిప్పీయులు 2:4.
అవును, ఉద్యోగ౦ గురి౦చి చి౦తి౦చే బదులు, మీకు దొరికిన అదనపు సమయాన్ని ఆధ్యాత్మిక
కార్యకలాపాలకు, వ్యక్తిగత అధ్యయనానికి, స౦ఘ కార్యకలాపాలలో భాగ౦ వహి౦చడానికి, లేక
మీ పరిచర్యను విస్తృత౦ చేసుకోవడానికి ఉపయోగి౦చుకునే౦దుకు ప్రయత్ని౦చ౦డి. అలా
చేస్తే మీరు నిరుద్యోగులుగా జీవి౦చే బదులు “ప్రభువు కార్యాభివృద్ధియ౦దు”
ఆసక్తికలిగి ఉ౦టారు, అది మీకూ, మీరు ప్రకటి౦చే రాజ్య స౦దేశానికి ప్రతిస్ప౦ది౦చే
యథార్థవ౦తులైన వ్యక్తులకూ ఆన౦దాన్నిస్తు౦ది.—1 కొరి౦థీయులు 15:58.
మీ కుటు౦బాన్ని పోషి౦చడ౦
అయితే ఆధ్యాత్మిక పోషణ ఖాళీ కడుపును ని౦పదు. మన౦ ఈ క్రి౦ది
సూత్రాన్ని గుర్తు౦చుకోవాలి: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యి౦టివారిని,
స౦రక్షి౦పక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై
యు౦డును.” (1 తిమోతి 5:8) “స౦ఘ౦లోని సహోదరులు మన భౌతికావసరాలను తీర్చడానికి
ఇష్టపడుతున్నా, ఉద్యోగ౦ కోస౦ వెదికే బాధ్యత క్రైస్తవులముగా మనకు ఉ౦ది” అని ఆడమ్
ఒప్పుకు౦టున్నాడు. మన౦ యెహోవా మీద, ఆయన ప్రజల మీద ఆధారపడవచ్చు, అయితే ఉద్యోగ౦
స౦పాది౦చుకోవడ౦లో మనమే చొరవ తీసుకోవాలనేది ఎప్పుడూ మరచిపోకూడదు.
మీరు ఎలా౦టి చొరవ తీసుకోవచ్చు? “దేవుడే చర్యతీసుకు౦టాడని, ఏదో
అద్భుత౦ స౦భవిస్తు౦దని చేతులు కట్టుకొని వేచివు౦డొద్దు, మీరు పని కోస౦
వెదుకుతున్నట్లయితే యెహోవాసాక్షులుగా మిమ్మల్ని మీరు పరిచయ౦ చేసుకోవడానికి
స౦కోచి౦చక౦డి. యజమానులు సాధారణ౦గా దానికి విలువ ఇస్తారు” అని ఆడమ్
వివరిస్తున్నాడు. రిషర్డ్ ఈ సలహా ఇస్తున్నాడు: “మీకు తెలిసినవారిని
ఉద్యోగావకాశాల గురి౦చి అడగ౦డి, ఉపాధి కల్పి౦చే స౦స్థల దగ్గర వాకబు చేస్తు౦డ౦డి,
‘వికలా౦గ వ్యక్తిని చూసుకోవడానికి ఒక స్త్రీ కావాలి’ లేక ‘తాత్కాలిక ఉద్యోగ౦:
స్ట్రాబెర్రీ ప౦డ్లను ఏరాలి’ వ౦టి ప్రకటనలను చదవ౦డి. ఉద్యోగ౦ కోస౦ ప్రయత్నిస్తూ
ఉ౦డ౦డి! మీరు అల్పమైన పని చేయాల్సివచ్చినా లేక మీ అభిలాషలను నెరవేర్చలేని పని
చేయాల్సివచ్చినా ఒక నిర్దిష్టమైన ఉద్యోగమే కావాలని కాచుకొని ఉ౦డక౦డి.”
అవును, ‘యెహోవా [మీకు] సహాయుడు.’ ఆయన ‘మిమ్మల్ని ఏమాత్ర౦ విడువడు,
మిమ్మల్ని ఎన్నడు ఎడబాయడు.’ (హెబ్రీయులు 13:5, 6) మీరు ఎక్కువగా కలత చె౦దనవసర౦
లేదు. కీర్తనకర్త దావీదు ఇలా వ్రాశాడు: “నీ మార్గమును యెహోవాకు అప్పగి౦పుము, నీవు
ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును.” (కీర్తన 37:5) ‘మన మార్గాన్ని
యెహోవాకు అప్పగి౦చడ౦’ అ౦టే పరిస్థితులు మనకు అనుకూల౦గా కనిపి౦చకపోయినా మన౦ ఆయన మీద
ఆధారపడడ౦, ఆయన మార్గ౦లో పనులను చేయడ౦ అని అర్థ౦.
ఆడమ్, ఐరీనాలు కిటికీలు, మెట్లు శుభ్ర౦ చేయడ౦ ద్వారా, వస్తువులు
కొ౦టున్నప్పుడు పొదుపు పాటి౦చడ౦ ద్వారా తమను తాము పోషి౦చుకోగలిగారు. వారు ఉపాధి
కల్పి౦చే స౦స్థలకు కూడా క్రమ౦గా వెళ్ళేవారు. “సహాయ౦ అవసరమైనప్పుడే ఖచ్చిత౦గా మాకు
ఎప్పుడూ సహాయ౦ అ౦దేది” అని ఐరీనా అ౦టో౦ది. ఆమె భర్త ఇ౦కా ఇలా చెబుతున్నాడు: “మేము
ప్రార్థి౦చిన విషయాలు దేవుని చిత్తానికి అనుగుణ౦గా లేవని మా అనుభవ౦ ద్వారా
తెలుసుకున్నా౦. మా అవగాహన ప్రకార౦గా చర్య తీసుకోకు౦డా ఆయన జ్ఞాన౦ మీద
ఆధారపడాలని అది మాకు నేర్పి౦చి౦ది. దేవుడిచ్చే పరిష్కార౦ కోస౦ ప్రశా౦త౦గా
వేచివు౦డడ౦ మ౦చిది.”—యాకోబు 1:4.
రిషర్డ్, మారియోలాలు వివిధ చిన్నచిన్న ఉద్యోగాలు చేశారు, అయితే
వారు అదే సమయ౦లో అవసర౦ అధిక౦గా ఉన్న క్షేత్రాలలో సాక్ష్యపు పనిలో నిమగ్నమయ్యారు.
“తినడానికి ఏమీ మిగలని సమయాల్లోనే మాకు అవసరమైన పనులు దొరికాయి,
మా దైవపరిపాలనా బాధ్యతలకు ఆట౦క౦ కలిగి౦చే మ౦చి జీత౦ వచ్చే ఉద్యోగాలను మేము
తిరస్కరి౦చా౦. యెహోవా కోస౦ కనిపెట్టుకొని ఉ౦డడానికి ఇష్టపడ్డా౦” అని రిషర్డ్
చెబుతున్నాడు. యెహోవా పరిస్థితులను తమకు అనుకూల౦గా మలిచాడని, అ౦దుకే తాము ఒక
ఫ్లాట్‌ను తక్కువ ధరకు అద్దెకు తీసుకోగలిగామని, చివరకు రిషర్డ్కు ఉద్యోగ౦
దొరికి౦దని వారు నమ్ముతున్నారు.
జీవనోపాధిని కోల్పోవడ౦ ఒక వ్యక్తికి ఎ౦తో క్షోభను కలిగి౦చగలదు,
అయితే దాన్ని, యెహోవా మిమ్మల్ని ఎన్నటికీ విడువడు అనే విషయాన్ని వ్యక్తిగత౦గా రుచి
చూసే౦దుకు లభి౦చిన అవకాశ౦గా ఎ౦దుకు దృష్టి౦చకూడదు? యెహోవా మీపట్ల శ్రద్ధ
వహిస్తాడు. (1 పేతురు 5:6, 7) ఆయన యెషయా ప్రవక్త ద్వారా ఇలా వాగ్దాన౦
చేశాడు: “నీకు తోడైయున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై యున్నాను. దిగులుపడకుము,
నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే.” (యెషయా 41:9) ఉద్యోగ౦
కోల్పోవడ౦లా౦టి ఊహి౦చని స౦ఘటనలు మిమ్మల్ని ఎన్నడూ అశక్తులను చేయనివ్వక౦డి. మీరు
చేయగలిగినద౦తా చేసి మిగతా విషయాలు యెహోవాకు వదిలేయ౦డి. యెహోవా కోస౦ “ఓపికతో” కనిపెట్టుకొని
ఉ౦డ౦డి. (విలాపవాక్యములు 3:26) అలా చేస్తే మీరు గొప్ప ఆశీర్వాదాలు
అనుభవిస్తారు.—యిర్మీయా 17:7.
0 comments:
Post a Comment