" తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను" .... లూకా 23:34
ఈ వాక్యభాగములోని యేసు క్రీస్తు ప్రభువుని సిలువ వేయుచునప్పుడు .. తన చుట్టూ వున్నప్రజలను చూసి ... వారిని క్షమించమని తండ్రికి ప్రార్ధన చేయుచున్నారు
అక్కడ మూడు రకాలైన ప్రజలు వున్నారు ...
అక్కడ మూడు రకాలైన ప్రజలు వున్నారు ...
l) శాస్త్రులు & పరిచర్యులు :- వీరు ధర్మశాస్త్రమును ఎరిగిన వారు కాని ధర్మశాస్త్రమును పాటించరు... తమ స్వలాభము కోసము ధర్మశాస్త్రాన్ని వాడుకునే వేషధారుల వంటి వారు ... లేఖనములోని వ్రాయబడిన మెస్సయ ఏసుక్రీస్తునే అని గ్రహించక ... యేసు మాట వినక మంధమతులై ... యేసుని ద్వేషించి ఆయనను అన్యాయముగా సిలువకు అప్పగించారు.
ll) ఇశ్రాయేలు ప్రజలు :- వీరు యేసు చేసిన అద్భుతాలు చుసిన వారు ... 5 రొట్టెలు 2 చిన్నచేపలను స్త్రీలు పిల్లలు కాక 5వెలమంది పురుషులకు పంచినప్పుడు ... ఆ ఆహారము తిన్న ప్రజలు .... అయినను కృతజ్ఞత లేని వారై ... శాస్త్రులు & పరిసర్యుల మాటలు నమ్మి ప్రభువుకి సిలువ వేయుడి సిలువ వేయుడి అని కేకలు వేసిన ప్రజలు
lll) రోమా సైనికులు :- ఇనుము వంటి మూర్ఖులైన ప్రజలు రోమా సైనికులు ... వీళ్ళకి మానవత్వం మంచితనము అన్నది లేదు ... బహు క్రూరంగా ప్రజలను హింసించే వారు
ఈ 3 రకాల ప్రజలను క్షమించమని ఏసుక్రీస్తు ప్రభువు సిలువలో శ్రమ అనుభవిస్తూ ప్రార్ధన చేసారు ....
అయితే ఆయన బిడ్డలమైన మనము ఏ విధముగా వున్నాము?? శాస్త్రులు & పరిసర్యుల వలె బైబుల్ చదువుచు వాటిని పాటించకుండ వేషధారుల భక్తి చేయుచున్నామా?? లేక బైబుల్ ప్రకారం నడుచుకొనుచు ... అజ్ఞానులైన ప్రజలను క్షమిస్తున్నామా??.....
అయితే ఆయన బిడ్డలమైన మనము ఏ విధముగా వున్నాము?? శాస్త్రులు & పరిసర్యుల వలె బైబుల్ చదువుచు వాటిని పాటించకుండ వేషధారుల భక్తి చేయుచున్నామా?? లేక బైబుల్ ప్రకారం నడుచుకొనుచు ... అజ్ఞానులైన ప్రజలను క్షమిస్తున్నామా??.....
దేవుడు చేసిన మేలులను మరిచిపోయి పాపము చేయుచు మరల ప్రభువును సిలువకు అప్పగించే వారముగా వున్నామా??? లేక మనం చేసిన మేలులను మరచిపోయి మనకు కీడు చేసే కృతజ్ఞత లేని ప్రజలను క్షమించే ప్రభువు బిడ్డల వలె వున్నామా??...
రోమా సైనికుల వలె మానవత్వం ప్రేమ లేకుండా ఇతరులను మాటల కొరడాలతో హించింసే వారముగా వున్నామా??? లేక మనలను హించింసి నిదించి మన మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికే వారిని 'తండ్రీ వీరు ఏమి చేయుచున్నారో వీరు యెరుగరు వీరిని క్షమించు " అని ప్రభువు వలె ప్రార్ధించే వారముగా వున్నామా....
.... ఈ Good Friday రోజున మనలను మనం పరిశీలన చేసుకుందాం .... ప్రభువు నడిచిన మార్గములో నడుద్దాం ...దేవుని బిడ్డగా జీవిద్దాం ..
దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్.
0 comments:
Post a Comment