Tuesday 4 February 2014

Greatness of jesus

Joh 10:16 ఈ దొడ్డివికాని వేరే గొర్రెలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా శబ్దమువినును, అప్పుడు మంద యొక్కటియు గొర్రెల కాపరి యొక్కడును అగును. 
Joh 10:17 నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 
Joh 10:18 ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.
Joh 10:19 ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను.
Joh 10:20 వారిలో అనేకులు - వాడు దయ్యము పట్టినవాడు వెర్రివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి.
Joh 10:21 మరికొందరు - ఇవి దయ్యము పట్టినవాని మాటలుకావు; దయ్యము గుడ్డివారి కన్నులు తెరువగలదా అని చెప్పిరి.
Joh 10:22 ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగుచుండెను.
Joh 10:23 అది శీతకాలము అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా
Joh 10:24 యూదులు ఆయనచుట్టు పొగై - యెంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి.
Joh 10:25 అందుకు యేసు -మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు; నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
Joh 10:26 అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు గనుక మీరు నమ్మరు.
Joh 10:27 నా గొర్రెలు నా శబ్దము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.
Joh 10:28 నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.
Joh 10:16 And other sheep I have, which are not of this fold: them also I must bring, and they shall hear my voice; and there shall be one fold, and one shepherd.
Joh 10:17 Therefore doth my Father love me, because I lay down my life, that I might take it again.
Joh 10:18 No man taketh it from me, but I lay it down of myself. I have power to lay it down, and I have power to take it again. This commandment have I received of my Father.
Joh 10:19 There was a division therefore again among the Jews for these sayings.
Joh 10:20 And many of them said, He hath a devil, and is mad; why hear ye him?
Joh 10:21 Others said, These are not the words of him that hath a devil. Can a devil open the eyes of the blind?
Joh 10:22 And it was at Jerusalem the feast of the dedication, and it was winter.
Joh 10:23 And Jesus walked in the temple in Solomon's porch.
Joh 10:24 Then came the Jews round about him, and said unto him, How long dost thou make us to doubt? If thou be the Christ, tell us plainly.
Joh 10:25 Jesus answered them, I told you, and ye believed not: the works that I do in my Father's name, they bear witness of me.
Joh 10:26 But ye believe not, because ye are not of my sheep, as I said unto you.
Joh 10:27 My sheep hear my voice, and I know them, and they follow me:
Joh 10:28 And I give unto them eternal life; and they shall never perish, neither shall any man pluck them out of my hand.
Categories:

0 comments:

Post a Comment